నేడే10వ తరగతి ఫలితాలు విడుదల|telangana 10th result today|download memos - Jobnews

Breaking

Friday, 21 May 2021

నేడే10వ తరగతి ఫలితాలు విడుదల|telangana 10th result today|download memos

 


పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ల వివరాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నారు. కరోనా కారణంగా గతేడాది మాదిరిగానే ఈసారి సైతం వార్షిక పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈసారి ప్రత్యక్ష తరగతులు నిర్వహించిన 44 రోజుల్లో అన్ని పాఠశాలల్లోనూ పార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఎ-1) పరీక్ష నిర్వహించారు. 20 మార్కుల ఈ పరీక్షలో వచ్చిన మార్పులను ఐదింతలు పెంచి (100 మార్కులకు) ఫలితాలు సిద్ధం చేశారు. ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించిన వారందరినీ ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించి0ది.


ప్రతిసారి పదోతరగతి ఫలితాల కోసం వెబ్సైట్లో హాల్ టికెట్ నమోదు చేస్తుండేవారు. గతేడాది సైతం పరీక్షలు జరగ కపోయినా హాల్ టికెట్ ద్వారానే మెమోలు పొందారు. కానీ ఈసారి హాల్ టికెట్ నెంబర్లు కేటాయించక ముందే పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఈసారి విద్యార్థులు హాల్టికెట్ స్థానంలో తమ పేరు, పుట్టిన తేదీ, పాఠశాల పేరు నమోదు చేసి మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ వర్గాలు తెలి పాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే విద్యార్థులు వెబ్సైట్: www.bse.telangana.gov.in నుంచి మార్కుల మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.