అంగన్వాడి టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - Jobnews

Breaking

Saturday, 24 April 2021

అంగన్వాడి టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 అంగన్వాడి టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌లోని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ- ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో మెయిన్‌ అంగన్వాడీ టీచర్ల నియామకానికి స్థానిక వివాహిత మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ధృవపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వినికిడి పరికరాలు వినియోగిస్తున్నవారు; అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించగలిగేవారు; కాళ్లు, చేతులకు సంబంధించిన వైకల్యాలు ఉన్నప్పటికీ పిల్లలకు ప్రాథమిక విద్య నేర్పించటంతోపాటు వారి సంరక్షణ బాధ్యతలు చూసుకోగల్గినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు: 42

ప్రాజెక్టులవారీ ఖాళీలు: చార్మినార్‌ 8, గోల్కొండ 10, ఖైరతాబాద్‌ 10, నాంపల్లి 9, సికింద్రాబాద్‌ 5

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


వయసు: జూలై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల్లో 21 ఏళ్ల మహిళలు లేని పక్షంలో 18 ఏళ్ల వయసున్నవారికి అవకాశం ఇస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 16

దరఖాస్తుకు జతచేయాల్సినవి: వయసు, కులం, విద్యార్హత, నివాసం, అంగవైకల్యం, వితంతువు, అనాథ తదితర అంశాలను ధృవపరచే పత్రాలు

ధృవపత్రాల పరిశీలన: మే 26

వెబ్‌సైట్‌: http://wdcw.tg.nic.in

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.