రెండు నెలలు ఉచిత బియ్యం పంపిణీ - Jobnews

Breaking

Saturday, 24 April 2021

రెండు నెలలు ఉచిత బియ్యం పంపిణీ

 రెండు నెలలు ఉచిత బియ్యం పంపిణీ
 మే- జూన్ రెండు నెలలు ఆహార భద్రత కార్డులు కలిగిఉన్న లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి రెండు నెలలు ఉచిత ఆహారధాన్యాలు పంపిణీచేస్తామని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆహార భద్రతకార్డులు కేంద్రం జారీచేసినవి, రాష్ట్రం జారీ చేసినవి వేర్వేరుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకుంటే 281 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో 87.55 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన కార్డులు 53.30 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన కార్డులు 34.25 లక్షలు ఉన్నాయి. కోవిడ్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం జారీచేసిన 53.30 లక్షల కార్డుదారు లకు ఉచిత బియ్యం రెండు నెలలపాటు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కలిపి ఇచ్చే కిలో బియ్యం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదేక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆహారభద్రత కార్డు లబ్ధిదా రులకు కూడా ఉచిత బియ్యం పంపిణీచేసే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తాను జారీ చేసిన కార్డుదారులకు బియ్యంపై నిర్ణయం తీసుకో వాల్సి ఉంది. గతేడాది కూడా కరోనా విపత్తు సమ యంలో కేంద్రం- రాష్ట్రం కలిసి ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేశాయి. 2020 లో ఏప్రిల్, మే, జూన నెలల్లో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేశారు. జులై నుంచి నవంబర్ వరకు 5 నెలలు 10 కిలోల(కేంద్రం 5, రాష్ట్రం 5) చొప్పున పంపిణీ చేశారు. డిసెంబర్ - 2020 తోపాటు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. కేంద్రం నిర్ణయానికి అను గుణంగా రాష్ట్రం కూడా ఉచిత పంపిణీకే మొగ్గుచూపు తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

పేపర్ క్లిప్ డౌన్లోడ్ లింక్👇👇👇

https://drive.google.com/file/d/1Pno2hcKGC-FV2bDQOjYHWynQl4WFx6g0/view?usp=drivesdk

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.