BANK JOB NOTIFICATION 2021| బ్యాంక్ ఆఫ్ బరోడా లో 511 మేనేజర్ పోస్టుల భర్తీక - Jobnews

Breaking

Friday, 9 April 2021

BANK JOB NOTIFICATION 2021| బ్యాంక్ ఆఫ్ బరోడా లో 511 మేనేజర్ పోస్టుల భర్తీక

BANK JOB NOTIFICATION 2021| బ్యాంక్ ఆఫ్ బరోడా లో 511 మేనేజర్ పోస్టుల భర్తీ




 దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 511 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

మొత్తం పోస్టులు: 511
ఇందులో సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్స్‌ 407, ఈ-రిలేషన్‌షిప్‌ మేనేజర్లు 50, టెర్రిటరీ అధిపతులు 44, గ్రూప్‌ హెడ్స్‌ 6, ప్రాడక్ట్‌ హెడ్స్‌ (ఇన్వెస్ట్‌మెంట్‌, రిసెర్చ్‌) 1, ఆరేషన్స్‌ అండ్‌ టెక్నాలజీ హెడ్‌ 1, డిజిటల్‌ సేల్స్‌ మేనేజర్‌ 1, ఐటీ ఫంక్షనల్‌ అనలిస్ట్ మేనేజర్‌ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి

అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 23 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ లేదా గ్రూప్‌డిస్కషన్‌. దరఖాస్తుల ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 9
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 29
వెబ్‌సైట్‌: www.bankofbaroda.co.in/Careers.htm

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.