బతుకమ్మ పండుగలో 9వ రోజున జరుపుకునే పండుగను
ఏమని పిలుస్తారు?
సద్దుల బతుకమ్మ
బోనాల పండుగలో దేవిని ఏ ఏ పేర్లతో పూజిస్తారు
మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, అంకాలమ్మ, పెద్దమ్మ డొక్కాలమ్మ, మారెమ్మ, పోలేరమ్మ
తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి, సమానత్వానికి
ప్రతీకగా భావించేది?
తెలంగాణ తల్లి విగ్రహం
తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ముఖ్యపాత్ర
వహించినవారు ఎవరు?
బి.ఎస్.రాములు, బి.వి.ఆర్.చారి, ప్రొ.గంగాధర్
నరసింహులు
తెలంగాణ తల్లి రూపాన్ని కవర్ పేజిగా రూపొందించిన
వార్తా పత్రిక
-ప్రజాతంత్ర వారపత్రిక
తెలంగాణ ఉద్యమ వార్తలను ప్రచురించిన (నమస్తే తెలంగాణ రాకముందు) ఏకైక దిన, వార పత్రిక
ప్రజాతంత్ర వారపత్రిక
తెలంగాణ తల్లి విగ్రహం మొదట ఎక్కడ తయారు
చేయబడింది?
-నల్గొండ జిల్లా మోత్కూరు దగ్గర గల బేగంపేట
గ్రామంలో
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏ పార్టీ అధ్యక్షురాలు బేగంపేట గ్రామంలో ఆవిష్కరించింది
తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు (విజయశాంతి)
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని
చిత్రించినవారు ఎవరు
ప్రొ.గంగాధర్
ప్రస్తుత తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని తయారు చేసిన
వ్యక్తి ఎవరు?
-నర్సింహులు
ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్కడ ఆవిష్కరించారు
గోదావరి ఖని బస్టాండ్ ముందు
ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదటగా ఎవరు, ఎక్కడ ఆవిష్కరించారు?
2007 నవంబర్15
-చంద్రశేఖర్ రావు, తెలంగాణ భవన్లో '
తొలిగా అవిష్కరించబడిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని
తయారు చేసిన వ్యక్తి
పసునూరి దయాకర్
తెలంగాణ తల్లి విగ్రహాలు అన్నింటికీ ఒకే ఎత్తు, ఒకే రకమైన రంగులను వాడాలని నిర్ణయించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు ఎంత ఉండాలని నిర్ణయించారు?
అడుగులు 8
తెలంగాణ తల్లి విగ్రహం ఎడమ చేతిలో ఉన్న బతుకమ్మ దేనికి చిహ్నంగా భావిస్తారు
తెలంగాణ సంస్కృతికి
తెలంగాణ తల్లి విగ్రహంలోని కాళ్లకు గల వెండి మట్టెలు దేనికి చిహ్నంగా భావిస్తారు
ముత్తైదువుకు చిహ్నంగా, ఇది కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన సాంప్రదాయానికి చిహ్నాంగా భావిస్తారు
తెలంగాణ తల్లి విగ్రహం కుడి చేతిలో ఉన్న జొన్న మొక్క జొన్న కంకులు దేనికి చిహ్నంగా భావిస్తారు?
మెట్టపంటలకు గుర్తుగా (మెదక్, ఆదిలాబాద్ మహబూబ్‌నగర్)
తెలంగాణ తల్లి విగ్రహంలోని కిరీటం, వడ్డాణంలోని వజ్రాలు దేనికి గుర్తుగా సూచించబడ్డాయి?
కోహినూర్ వజ్రం, జాకోబ్ వజ్రం
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం(1969)లో ఎంతమంది అమరులయ్యారు ?
369 మంది
1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కొరకు ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్థూపం ఎక్కడ ఏర్పాటు చేశారు?
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద
1969 అమరవీరుల స్మారక స్థూపంను చెక్కిన శిల్పి
ఎవరు?
ఎక్కా యాదగిరిరావు
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.