పదవ తరగతి అర్హత ఉద్యోగాలు - Jobnews

Breaking

Monday, 22 February 2021

పదవ తరగతి అర్హత ఉద్యోగాలు

 


వివిధ నావల్‌ కమాండ్‌లలో ఖాళీగా ఉన్న ట్రేడ్స్‌ మ్యాన్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ నేవీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1159 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికోసం సివిలియన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఐఎన్‌సీఈటీ టీఎంఎంను నిర్వహిస్తారు.


మొత్తం పోస్టులు: 1159


ఇందులో ఈస్టర్న్‌ నావల్‌ కమాండ్‌లో 710, వెస్టర్న్‌ నావల్‌ కమాండ్‌లో 324, సౌతర్న్‌ నావల్‌ కమాండ్‌లో 125 చొప్పున పోస్టులు ఉన్నాయి.


అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి.


18 నుంచి 25 ఏండ్ల లోపు ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా. ఎంపిక చేసినవారిని రాతపరీక్షకు పిలుస్తారు.


పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో


దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 22


దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 7


వెబ్‌సైట్‌: joinindiannavy.gov.in


No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.