Latest job notification 2021 - Jobnews

Breaking

Monday, 18 January 2021

Latest job notification 2021

 

notificat

భారత వాయుసేన.. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)లో ఎయిర్‌మెన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టు: ఎయిర్‌ మెన్‌

విభాగాలు: గ్రూప్‌-ఎక్స్‌ (ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ట్రేడ్‌ మినహాయించి)- ఫిట్టర్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఫిట్టర్‌, ప్రొపల్షన్‌ ఫిట్టర్‌ తదితరాలు ఉన్నాయి. 


గ్రూప్‌-వై (ఐఏఎఫ్‌ (ఎస్‌) & మ్యూజిషియన్‌ ట్రేడ్‌ మినహాయించి)-కమ్యూనికేషన్‌ టెక్నీషియన్లు, ఆటోమొబైల్‌ టెక్నీషియన్లు, గ్రూప్‌-వై (మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌), నాన్‌ టెక్నికల్‌ విభాగంలో అడ్మిన్‌, యాక్ట్స్‌, ఓపీఎస్‌, గ్రౌండ్‌ ట్రెయినింగ్‌, లాజిస్టిక్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ తదితరాలు ఉంటాయి.


విద్యార్హతలు: 


గ్రూప్‌-ఎక్స్‌ (ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ట్రేడ్‌ మినహాయించి) పోస్టులకు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులు)గా కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.


గ్రూప్‌-వై (ఐఏఎఫ్‌(ఎస్‌) & మ్యూజిషియన్‌ ట్రేడ్‌ మినహాయించి) పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత.


గ్రూప్‌-వై (మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌) పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, కెమిస్ట్రీ, బయోలజీ సబ్జెక్టులతో) ఉత్తీర్ణత. 


నోట్‌: గ్రూప్‌ ‘ఎక్స్‌' పరీక్షకు అర్హులైన అభ్యర్థులు (ఇంటర్‌) గ్రూప్‌ ‘వై’కి సైతం అర్హులు అవుతారు.


డిప్లొమా అభ్యర్థులు గ్రూప్‌ X ట్రేడ్‌కు మాత్రమే హాజరుకావడానికి అర్హులు.


వయస్సు: 21 ఏండ్లకు మించరాదు. 


శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 152.5 సెం.మీ. ఉండాలి. కొన్ని ట్రేడ్‌లకు 165 సెం.మీ ఎత్తు ఉండాలి. 


ఎంపిక: శరీర దారుఢ్య పరీక్ష, మెడికల్‌ పరీక్ష, ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.


గ్రూప్‌-ఎక్స్‌ పోస్టులకు నిర్వహించే పరీక్షలో ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.


గ్రూప్‌-వై పోస్టులకు నిర్వహించే పరీక్షలో ఇంగ్లిష్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. 


రెండు ట్రేడ్‌లకు పరీక్ష రాసే అభ్యర్థులకు 85 నిమిషాలు సమయం ఇస్తారు. అందులో ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలు ఇస్తారు.


నోట్‌: తప్పు జవాబుకు 0.25 మార్కు  కోతవిధిస్తారు. 


ముఖ్యతేదీలు


దరఖాస్తు: ఆన్‌లైన్‌లో  జనవరి 22 నుంచి


చివరితేదీ:          ఫిబ్రవరి 7


పరీక్ష ఫీజు:         రూ.250/- 


ఆన్‌లైన్‌ పరీక్షతేదీ: ఏప్రిల్‌ 18-22 మధ్య నిర్వహిస్తారు.


వెబ్‌సైట్‌: Click here.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.