ఏటూరునాగారం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో హేమలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు అంగన్వాడీ, ఏడు ఆయా(హెల్పర్) పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.wdcw.tg.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని లిపారు
ములుగు ఐసీడీఎస్ పరిధిలో..
ములుగురూరల్, జనవరి5: ములుగు ఐసీడీఎస్ పరిధిలోని ములుగు, వెంకటాపూర్ మండలాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో దేవరశెట్టి లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
6 అంగన్వాడీ టీచర్లు, 31 ఆయాలు, 19 మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. https:// mis.tgwdcw.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.