ఈనెల కరుణ రైతు బంధు అమౌంట్ విడుదల - Jobnews

Breaking

Saturday, 7 November 2020

ఈనెల కరుణ రైతు బంధు అమౌంట్ విడుదల

click here రైతులకు పెట్టుబడి సాయం అందించే 'రైతుబంధు' పథకం.. ఈ యాసంగి సీజన్‌లోనూ అమ లు కానుంది. ఇందుకు సంబంధించిన డబ్బును ఈ నెలాఖరులో గానీ, డిసెంబరు మొదటి వారంలో గానీ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం 2018 వానాకాలం సీజన్‌ నుంచి అమలవుతున్న విషయం తెలిసిందే. కాగా, గత వానాకాలం సీజన్‌కు సంబంధించి పంటల కోతలు భారీ వర్షాల కారణంగా ఆలస్యంగా ప్రారంభమై ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. దీంతో యాసంగి సీజన్‌ ప్రారంభమైనా ఇంకా పంటల సాగు మొదలు కాలేదు. ముందస్తుగా వరికోతలు పూర్తయిన చోట్ల కూడా ఇంకా నార్లు పోయడంగానీ, నాట్లు వేయడం గానీ జరగలేదు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి రైతుబంధు డబ్బులు ఎప్పుడు చెల్లిస్తుందనే చర్చ మొదలైంది. కానీ, ప్రభుత్వం నుంచి వ్యవసాయశాఖకు ఇంకా ఎలాంటి సంకేతాలు, ఆదేశాలు రాలేదని వ్యవసాయ కమిషనరేట్‌లో రైతుబంధు విభాగాన్ని పర్యవేక్షించే సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు వానాకాలం సీజన్‌లో వరిసాగు భారీగా పెరిగిన నేపథ్యంలో.. 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ధాన్యం సేకరణకు నిధుల సమీకరణ జరుగుతోంది. దీంతో యాసంగి సీజన్‌కు రైతుబంధు కోసం ఈ నెలాఖరు వరకు నిధులు సర్దుబాటు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. శనివారం 2020-21 బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ మధ్యంతర సమీక్ష జరపనున్నారు. ఇందులో రైతుబంధు నిధుల సర్దుబాటుపై చర్చించే అవకాశముంది

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.