సాదాబైనామా కి అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ - Jobnews

Breaking

Tuesday, 20 October 2020

సాదాబైనామా కి అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 'మీ సేవ' కేంద్రాల్లో వీటిని స్వీకరించనున్నారు. 2014 జూన్‌ 2వ తేదీ నాటికి తెల్లకాగితం (సాదా బైనామా)పై జరిగిన ఒప్పందాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ జీవో జారీ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒప్పందాలు చేసుకున్నవారికే ఇది వర్తిస్తుంది. హెచ్‌ఎండీఏ/కాకతీయ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (కుడా), మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో అవకాశం లేదు. అయితే, 2016 డిసెంబరు 9వ తేదీన జీవో నం.294తో పాటు 2017 ఫిబ్రవరి 4వ తేదీన జారీ చేసిన జీవో నం.33లోని మండలాల్లో మాత్రం క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.


ఇవన్నీ హెచ్‌ఎండీఏ, కుడా, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాల్టీల్లో గ్రామీణ రూపురేఖలున్న మండలాలు. ఐదెకరాల్లోపు విస్తీర్ణం ఉన్న భూముల దరఖాస్తులను ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు.

ప్రతి దరఖాస్తుకు ఇవి తప్పనిసరి

సమగ్ర వివరాలతో దరఖాస్తు

తాజా మార్గదర్శకాలతో పాటే 'మీ సేవ'లో సమర్పించే దరఖాస్తు ప్రొఫార్మా కూడా జారీ చేశారు. అప్లికేషన్‌లో దరఖాస్తుదారు ఫొటో, పేరు, ఆధార్‌, సామాజిక వివరాలు, పుట్టిన తేదీ, వృత్తితో పాటు చిరునామా, ఫోన్‌ నంబరు, భూములు అమ్మివారి వివరాలు, వారి చిరునామా, ఇద్దరి పాస్‌పుస్తకం వివరాలు, విస్తీర్ణం, సరిహద్దులు, భూమి ఎవరి పొజిషన్‌లో ఉన్నది? వంటి అంశాలను పొందుపరిచారు. మొత్తం దరఖాస్తు 25 గడులతో ఉంది.

సాదాబైనామా అప్లికేషన్ ఫాం డౌన్లోడ్ చేసుకోండి

Click here

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.