ఆర్మీ స్కూల్ లో ఎనిమిది వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - Jobnews

Breaking

Friday, 2 October 2020

ఆర్మీ స్కూల్ లో ఎనిమిది వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 8వేల టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఇందుకోసం నిర్వహించే ప్రాథమిక పరీక్ష తేదీని ఖరారు చేశారు. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. వీటిలో టీజీటీ, పీజీటీ, పీఆర్టీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 20. ఈ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ నవంబరు 21,22 తేదీల్లో ఉంటుంది గమనిక: పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సంబంధిత పాఠశాలలు విడుదల చేసే ప్రకటనను అనుసరించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పాఠశాలలు తదుపరి నియామక ప్రక్రియ (ఇంటర్వ్యూ , బోధనా నైపుణ్యాల పరిశీలన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ) ద్వారా ఖాళీలను భర్తీ చేస్తాయి. సాధారణంగా నవంబరు-మార్చి మధ్యలో ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది ముఖ్య సమాచారం మొత్తం ఖాళీలు: 8000 పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్టీ అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సీటెట్/ఆయా రాష్ట్రాల టెట్ లో అర్హత సాధించి ఉండాలి వయసు: 40 ఏళ్లు మించకూడదు. ఐదేళ్ల టీచింగ్ అనుభవం ఉన్న వారికి గిరష్ట వయోపరిమితి 57 ఏళ్లు స్క్రీనింగ్ పరీక్ష తేదీ: నవంబరు 21,22 తేదీల్లో ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ హైదరాబాద్, సికింద్రాబాద్ దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు: రూ.500 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2020 అభ్యర్థులు పూర్తి వివరాలకు website వెబ్సైట్ చూడొచ్చు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.