Paper Clip Download click here
అన్నదాతలకు యాసంగి సీజన్లో రైతుబంధు నిధులను సకాలంలో ఇచ్చేందుకు సర్కారు సన్నాహాలు మొదలు పెట్టింది. వానాకాలం సీజన్లో ఇచ్చినట్టే యాసంగిలోనూ రూ.7.200 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసే అవకాశం ఉందని వ్యవ సాయశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 57 లక్షల మంది రైతులకు లబ్ది కలగనుందని చెబుతున్నారు. మొత్తం 1.40 కోట్ల ఎకరాల విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకొని రైతుబంధు సొమ్మును అందజేస్తారు. గత వానాకాలం తర్వాత వ్యవసాయ భూముల క్రయవిక్ర యాలు ఎక్కడైనా జరిగి ఉంటే, ఆ మారిన వివరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ వర్గాలు కోరినట్లు సమా చారం. అనంతరం రైతుబంధు మార్గదర్శ కాలు విడుదలచేసి సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేస్తారు. సీజన్ ప్రారంభానికి ముందు విత్తనాలు, సాగు ఖర్చులు, ఇతరఅవసరాలకు ఈ సొమ్మును ఏటా రెండుసార్లు అందచేస్తోంది ఇప్పటికే యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతులు విత్తనాలు కొంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఈ సొమ్ము రైతులకు అందజేసే అవకాశం ఉందని వ్యవ సాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి వర్షాల కారణంగా రాష్ట్రంలో 12 లక్షల ఎక రాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసా యశాఖ సోమవారం ప్రాథమికంగా అంచనా వేసింది. దీంతో అన్నదాత లబోదిబోమం టున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడొస్తుందా అనే ఎదు రుచూపు మొదలైంది. అయితే దానికంటే ముందు యాసంగికి అవసరమైన ఖర్చుల కోసం రైతుబంధు సొమ్ము వస్తే ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోను న్నదని ఓ అధికారి తెలిపారు.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.