6500 పోలీసు పోస్టులు భర్తీ చేస్తాం: జగన్ - Jobnews

Breaking

Wednesday, 21 October 2020

6500 పోలీసు పోస్టులు భర్తీ చేస్తాం: జగన్

 6500 పోలీసు పోస్టులు భర్తీ చేస్తాం: జగన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో: మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని, నేరం చేసిన ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో CM పాల్గొన్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరిలో షెడ్యూల్ జారీ చేస్తామన్నారు. 4 దశల్లో 6,500 పోస్టులు భర్తీ చేస్తామని జగన్ ప్రకటించారు.

పోలీసు అమరవీరుల దినోత్సవం ఎందుకు

ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న 'పోలీసు అమరవీరుల దినోత్సవం' జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దులోని ఆక్సాయ్చిన్ వద్ద 1959 అక్టోబర్ 21న చైనా సైనికులు మన దేశంలో చొచ్చుకొచ్చాయి వారితో విరోచితంగా పోరాడి 10 CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు వీర మరణాలు స్మరించుకుంటూ తొలిసారి 1960 అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవం జరిపారు దేశవ్యాప్తంగా వారం పాటు పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహిస్తారు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.