తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎంసెట్-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ లోని కూకట్ పల్లి జేఎన్టీయూహెచ్ లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం నాలుగు రోజులపాటు ఆన్లైన్ ద్వారా అధికారులు ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందుకోసం మొత్తం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో 19 తెలంగాణలో, 23 పరీక్షా కేంద్రాలు ఏపీలో ఉన్నాయి.
ఎంసెట్ ఇంజినీరింగ్ లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు. మొత్తంగా పరీక్షకు 1,19,183 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 89,734 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి వెల్లడించారు. కరోనా వల్ల హాజరుకాని విద్యార్థులకు ఈ నెల 8వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.