బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - Jobnews

Breaking

Sunday, 13 September 2020

బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

సీట్లు రిజర్వేషన్ల వారీగా కేటాయింపు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరి ధిలోని బాసర ట్రిపుల్ ఐటీలో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నోటి ఫికేషన్ వర్సిటీ ఏవో రాజేశ్వర్ రావు శనివారం విడుదలచేశారు. టీఎస్ ఆన్ లైన్, మీ సేవ కేంద్రాల ద్వారా admissions@rgukt.ac.in వెబ్ సైట్ ద్వా రా ఈ నెల 16 నుంచి వచ్చేనెల మూడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచిం చారు. టెన్త్ పాస్ైన విద్యార్థులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైనవారి జాబితా అక్టోబర్ 20న విడుదల చేస్తామన్నారు. కొవిడ్ దృష్ట్యా పదోతరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రభుత్వం అందరినీ పాస్ చేసింది .

ఏపీ కోటా సీట్లు తర్వాత భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 15 శాతం సీట్లను తర్వాత భర్తీ చేయను న్నారు. ఆ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించకపోవడంతో ఆ సీట్లను తర్వాత భర్తీ చేయనున్నారు. దీంతో ఓపెన్ క్యాటగిరీలో 15 శాతం సీట్లను ఏపీలో గ్రేడ్లు నిర్ణయించాకే భర్తీ చేస్తామని, ఈ విషయాన్ని వెబ్సైట్లో పొందప ర్చనున్నట్లు ఏవో రాజేశ్వర్రావు తెలిపారు. వీటిపై సందేహాల నివృత్తికి హెలైన్ నంబర్లకు 957300 1992, 9703760686 ఫోన్ చేయాలని సూచించారు

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.