రైతులకు అదిరిపోయే శుభవార్త సులభంగా ట్రాక్టర్ లోన్ లక్ష వరకు తగ్గింపు - Jobnews

Breaking

Sunday, 20 September 2020

రైతులకు అదిరిపోయే శుభవార్త సులభంగా ట్రాక్టర్ లోన్ లక్ష వరకు తగ్గింపు

రైతులకు అదిరిపోయే శుభవార్త సులభంగా ట్రాక్టర్ లోన్ లక్ష వరకు తగ్గింపు


వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ ల వినియోగం రోజు రోజుకు ఎక్కువైపోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడైతే పొలం

దున్నడానికి కాడెద్దుల నాగలి వాడే వారు.. కానీ ప్రస్తుతం అందరూ ట్రాక్టర్ వినియోగిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రతి పనికి కూడా ప్రస్తుతం ట్రాక్టరు వినియోగం తప్పనిసరి గా మారిపోయింది. ఎంతో మంది రైతులు వ్యవసాయానికి గాను ట్రాక్టర్ కొనుగోలు చేయాలని భావించి... డబ్బులు లేక చివరికి వెనకడుగు వేస్తున్నారు. అయితే రైతులందరికీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. రైతులందరికీ మేలు జరిగే విధంగా సరికొత్త స్కీం ను అందుబాటులోకి తీసుకువచ్చింది

వ్యవసాయ వృద్ధి కోసం యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ బ్యాంక్ కొత్త స్కీం అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకువచ్చిన కొత్త స్కీమ్ తో రైతులు అందరికీ ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణం కంటే ఎక్కువ మొత్తంలోనే వర్షాలు కురుస్తూ పాడిపంటలు అన్నీ సస్యశ్యామలంగా ఉన్న నేపథ్యంలో... రైతులందరూ మరింత ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది. వ్యవసాయ రంగం లక్ష్యంగా కొత్త స్కీమ్ వచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమ్ ఆదిత్య సింగ్ తెలిపారు

ఈ క్రమంలోనే లక్నో జోన్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాదిరిగానే దేశవ్యాప్తంగా కూడా రైతులందరికీ క్లస్టర్ మోడల్ ఆఫ్ ట్రాక్టర్ ఫైనాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణయం తీసుకుంది ఆయన చెప్పుకొచ్చారు. దేశంలోని పలు నగరాల్లో.. ఈ తరహా పాలన సేవలను తమ తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు దీనికోసం రైతులకు అధికారులు వేగంగా రుణాలు అందిస్తారని తెలిపారు ఆయన. ఈ క్రమంలోనే కస్టమర్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చని తద్వారా లక్ష వరకు తగ్గింపు ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది అంటూ శుభవార్త తెలిపింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రాంతాలను బట్టి ఈ స్కీం లో మార్పులు వస్తాయని తెలిపారు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.