PM Kisan: మీ అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? కారణమిదే - Jobnews

Breaking

Wednesday, 12 August 2020

PM Kisan: మీ అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? కారణమిదే

PM Kisan: మీ అకౌంట్‌లోకి పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? కారణమిదే


PM Kisan Scheme | కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంరా 6వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. 8.5 కోట్ల రైతులకు రూ.17,000 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే రైతులు చిన్నచిన్న తప్పులు చేయడం వల్ల డబ్బులు క్రెడిట్ కావట్లేదు. మరి మీ అకౌంట్‌లోకి డబ్బులు రాలేదా? కారణం ఇదే కావొచ్చు.




1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి-PM Kisan స్కీమ్ లబ్ధిదారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం 6వ విడత డబ్బుల్ని బదిలీ చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతీ ఏటా రూ.6000 బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడ విడతల్లో ఈ డబ్బులు బదిలీ అవుతాయి.






2. పీఎం కిసాన్ స్కీమ్ 6వ విడత డబ్బుల్ని 8.5 కోట్ల మంది రైతులకు రూ.17,000 కోట్లు బదిలీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ వెరిఫైడ్ బ్యాంక్ అకౌంట్లకు ఈ డబ్బులు వస్తాయి.






3. అయితే ప్రతీసారి పీఎం కిసాన్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు కొంతమంది రైతుల ఖాతాల్లోకి నగదు రావట్లేదు. రైతుల వివరాలు సరిగ్గా లేకపోవడం, ఇచ్చిన వివరాల్లో తప్పుపు ఉండటం వల్ల నగదు బదిలీ కావట్లేదని తేలింది.





4. గతంలో రైతులు చేసిన ఓ చిన్న తప్పు వల్ల 70 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని తేలింది. ఒక విడత కాదు... మూడు విడతల్లో కలిపి 70 లక్షల మంది రైతులకు రూ.6000 చొప్పున లెక్కేస్తే మొత్తం రూ.4,200 కోట్లు జమ కాలేదు.





5. ఇంతకీ ఆ రైతులు చేసిన తప్పు ఏంటా అని చెక్ చేస్తే పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని తేలింది. మీ వివరాల్లో కూడా ఇలాంటి తప్పులు ఉంటే నగదు జమ కావు. అందుకే వివరాలు సరిచూసుకోండి.





6. మీకు పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే ఓసారి వివరాలు చెక్ చేసుకోండి. మీరు సమర్పించిన డాక్యుమెంట్లలో, బ్యాంకు అకౌంట్లలో పేర్లు వేర్వేరుగా ఉన్నాయేమో చెక్ చేయండి.





7. కేంద్ర ప్రభుత్వం ఆటోమెటిక్ సిస్టమ్ ద్వారా డబ్బుల్ని ఒకేసారి జమ చేస్తుంది ప్రభుత్వం. పేర్లు మ్యాచ్ కాకపోతే మనీ ట్రాన్స్‌ఫర్ జరగదు. డాక్యుమెంట్‌లో ఒక పేరు, బ్యాంకు అకౌంట్‌లో మరో పేరు ఉండటం వల్ల ఈ సమస్య వస్తోంది.


8. ఆధార్ కార్డులో, బ్యాంకు అకౌంట్‌లో పేర్లు ఒకేలా ఉండేలా చూసుకోండి. ఒకవేళ పేర్లు తప్పుగా నమోదైనట్టైతే https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో సరిచేసుకోవచ్చు.






9. ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి. అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.





10. సబ్మిట్ చేసిన తర్వాత వివరాలు కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసుకొని సరిదిద్దుకోవాలి. ఇంకా ఏవైనా తప్పులు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారుల్ని సంప్రదించాలి.





11. పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్: 011-24300606, 155261, 0120-6025109, పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్: 18001155266, పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నెంబర్: 011—23381092, 23382401 నెంబర్లను సంప్రదించొచ్చు. pmkisan- ict@gov.in మెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.