Pan aadhar link last date march 31,2021
పాన్ కార్డులను ఆధార్ కార్డుతో మార్చి 31, 2021 లోగా లింక్ చేసుకోవాలని ఐటీ శాఖ ఇప్పటికే పలుసార్లు గుర్తు చేసిన విషయం తెలిసిందే. ఆ విధంగా లింక్ చేయని సుమారు 18 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయని.... గడువు ముగిసేలోగా వాటిని ఆధార్ సంఖ్య జోడించకపోతే నిర్వీర్యం చేస్తామని ఆ శాఖ తెలిపింది. ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపేవారిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. కొందరు విలాసవంతంగా ఖర్చులు చేస్తూ.. పన్నులను ఎగవేసేందుకు ఒకటి కన్న ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేస్తే, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందే అవకాశం ఉండదని.. అందుకే లింక్ చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని వివరించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మ్యూచివల్ ఫండ్, క్రెడిట్-డెబిట్ కార్డులు వంటి వ్యవస్థల ద్వారా జరిగే భారీ లావాదేవీలను గుర్తించి... ఆ వ్యయాల తీరుపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టనుంది. ఈ క్రమంలో స్టేట్ మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్ (ఎస్టీ)సహాయంతో సంబంధిత వ్యక్తులను గుర్తించనున్నారు.
సుమారు 130 కోట్ల జనాభాలో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లిస్తున్నారని ప్రధాని ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌలభ్యం కోసం.. “పారదర్శక పన్ను విధానం...నిజాయితీపరులకు గౌరవం (ట్రాన్సపరెంట్ ట్యాక్సేషన్...హానరింగ్ ద హానెస్ట్)” అన్న ఆదాయ పన్ను శాఖ పోర్టల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పన్ను చెల్లింపు కోసం ప్రజలు కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ చర్యను చేపట్టామని ఆయన అన్నారు. దీనిద్వారా పన్నుల విధానం సులభం పారదర్శకం కానుందని.. అదేసమయంలో పౌరులు కూడా బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించాలని, ద్వారా ప్రగతికి చేయూతనివ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు
https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html
18 కోట్ల పాన్ కార్డులపై వేటు..?

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.