మీరు జిమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయారా అయితే ఇలా రికవర్ చేయండి.
జీ మెయిల్ ప్రతిఒక్కరి జీవితంలో ఒకసారైనా ఖచ్చితంగా అవసరమవుతుంది. అంతేకాదు, చాలామంది ఇది జీతంగా భాగంగా కూడా మారింది. ఆఫీస్ పనులకే కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలోని అవసరాలకు కూడా అన్ని విషయాలకు ఇది ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా, జీ మెయిల్ మరే ఇతర సర్వీస్ అయినా ఉపయోగించాలనుకుంటే, మీకు ఇదే జీ మెయిల్ అకౌంట్ అవసరం అవుతుంది. మరొక విషయం మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ను ఉపయోగిస్తే, ఈ ఖాతా తప్పనిసరి. కాబట్టి, ఇంత ముఖ్యమైన ఈ జీ మెయిల్ పాస్ వర్డ్ ను మరచిపోవడం సమస్యగా ఉంటుంది. మీరు మీ జీ మెయిల్ పాస్ వర్డ్ ను మరచిపోతే సింపుల్ గా ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి.
Step 1 - మొదట మీ గూగుల్ అకౌంట్ లేదా జీ మెయిల్ పేజీని తెరవండి.
Step 2 - ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీలోని 'ఫర్గెట్ పాస్ వర్డ్ 'ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3 - మీకు గుర్తువున్న చివరి పాస్ వర్డ్ ను నమోదు చేయండి. మీకు పాస్ వర్డ్ గుర్తులేకపోతే, '
మరో మార్గం ప్రయత్నించండి' (Try another way) ఆప్షన్ నుఎంచుకోండి.
Step 4 - మీజీ మెయిల్ ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్ కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.
Step 5 - మీకు ఫోన్ నంబర్ లేకపోతే, Google మీ ఇమెయిల్ కు ఒక వెరిఫికేషన్ కోడ్ను పంపుతుంది.
మీకు ప్రత్యామ్నాయ ఇమెయిల్ లేకపోతే, 'Try another way' ఎంచుకోండి.
Step 6 - ఇక్కడ గూగుల్ మీ ఇ-మెయిల్ కు బదులు ఆల్టర్నేటివ్ ఇ-మెయిల్ ఐడి ని అడుగుతుంది.
Step 7: ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఇ-మెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీని తెరవండి.
Step 8 - రికవర్ అయిన తర్వాత, క్రొత్త పాస్ వర్డ్ ఉపయోగించి మీ జీ మెయిల్ కు లాగిన్ అవ్వండి.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.