ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త మెరిట్ స్కాలర్ షిప్ ల కోసం దరఖాస్తు చేసుకోండి. - Jobnews

Breaking

Saturday, 29 August 2020

ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త మెరిట్ స్కాలర్ షిప్ ల కోసం దరఖాస్తు చేసుకోండి.

ఇంటర్ పాసైన విద్యార్థులకు శుభవార్త మెరిట్ స్కాలర్ షిప్ ల కోసం దరఖాస్తు చేసుకోండి.



ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మెరిట్ స్కాలర్షిప్ లు అందించనుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను నూతన దరఖాస్తు కోసం ఎంహెచ్ఆర్డీ తెలంగాణ రాష్ట్రానికి 2,570 స్కాలర్షిప్లను కేటాయించింది. ఈ స్కాలర్షిప్ కు అక్టోబరు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఈ ఉపకారవేతనాలకు ప్రాథమికంగా ఎంపికైన మంది ఇంటర్ విద్యార్థుల పేర్లు తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ https//tsbie.cgg.gov.in లో ఉంచింది. ఈ సంబంధిత అభ్యర్థులంతా https: //scholarships.gov.in/ పోర్టల్ ద్వా రా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



అంతేకాకుండా 2016-17 నుంచి 20192020 వరకు స్కాలర్షిప్ రెన్యువల్ కు చివరి తేదీ కూడా అక్టోబర్ 31 గా స్పష్టం చేసింది. ఆసక్తి ఉన్న విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.