డాక్యుమెంట్స్ లేకుండా ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోవడం ఎలా - Jobnews

Breaking

Wednesday, 12 August 2020

డాక్యుమెంట్స్ లేకుండా ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోవడం ఎలా

డాక్యుమెంట్స్ లేకుండా ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోవడం ఎలా?

ఆధార్ కార్డు వినియోగం ఇప్పుడు తప్పనిసరి అయింది. ప్రస్తుత చిరునామాను అప్ డేట్ చేయాలంటే ఏదైనా డాక్యుమెంట్ గానీ, అడ్రస్ ప్రూఫ్ గానీ అవసరం. ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ తో పనిలేకుండా ఆన్లైన్ ద్వారా చిరునామా మార్పు చేసుకోవాలి అదెలా అంటే..
స్టెప్ 1: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) uidai.gov.in అధికారిక వెబ్సైటు ఓపెన్ చేయండి. UIDAI వ్యక్తులకు 12 అంకెల ప్రత్యేక ID నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ను జారీ చేస్తుంది

స్టెప్ 2: ఇప్పుడు 'మై ఆధార్' మెనులోని 'అడ్రస్ ధ్రువీకరణ లెటర్' పై క్లిక్ చేయండి

స్టెప్ :'రిక్వెస్ట్ ఫర్ అడ్రస్ వాలిడేషన్ లెటర్' కోసం కొత్త
పేజీ ఓపెన్ అవుతుంది
ఇందులో చెల్లుబాటు అయ్యే 12-అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడిని నమోదు చేయండి

స్టెప్ 4: ధృవీకరణ కోసం 'కాప్చా కోడ్' ఎంటర్ చేసి 'సెండ్ OTP' బటన్ మీద క్లిక్ చేయండి

స్టెప్ 5: రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ కు పంపిన 6-అంకెల OTP లేదా 8 అంకెల OTP ని ఎంటర్ చేసి ఆపై 'లాగిన్' బటన్ మీద క్లిక్ చేయండి

స్టెప్ 6: లాగిన్ అయిన తర్వాత 'వెరిఫైయర్ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. 'అడ్రస్ వెరిఫైయర్ ఆధార్ నెంబర్ ను నమోదు చేయండి.


స్టెప్ 7: అప్ డేట్ కు సమ్మతి ఇవ్వడానికి అతను, ఆమె
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై లింక్ వెరిఫై కోసం ఒక
ఎస్ఎంఎస్ వస్తుంది

స్టెప్ : వెరిఫైయర్ లింక్పై క్లిక్ చేసిన తర్వాత అతను ఆమె ఓటీపీ ధృవీకరణ కోసం మరొక ఎస్ఎంఎస్ ను అందుకుంటారు

స్టెప్: ధృవీకరణను పూర్తి చేయడం కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు కాప్చా కోడ్లో పంపిన ఓటీపీ ని నమోదు చేయండి

స్టెప్ 10: దీనిని ధృవీకరించిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ (ఎస్ఆర్ఎన్) లభిస్తుంది.


స్టెప్ 11: తరువాత 'ఎస్ఆర్ఎన్' సాయంతో లాగిన్ అవ్వండి. ఇప్పుడు కొత్త చిరునామాను అప్ డేట్ చేయండి. కావాలంటే స్థానిక భాషను కూడా సవరించండి తరువాత డిక్లరేషన్ మీద టిక్ గుర్తును ఉంచి ఆపై 'సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్ 12: మీ స్థానిక భాషలో అడ్రసును సవరించండి. 'సేవ్ బటన్ పై క్లిక్ చేయండి స్టెప్ 13: ఇప్పుడు డిక్లరేషన్ 'సమర్పించు' అభ్యర్థనకు

వ్యతిరేకంగా టిక్ చేయండి స్టెప్ 14: మీరు 'సీక్రెట్ కోడ్' సాయంతో పంపిన 'అడ్రస్ వాలిడేషన్ లెటర్' ని ధృవీకరణ చిరునామాకు పోస్ట్ ద్వారా అందుకుంటారు

స్టెప్ 15: 'SSUP' (UIDAI) వెబ్ సైట్ ను తిరిగి ఓపెన్ చేసి ప్రొసెస్ట్ అప్డేట్ అడ్రస్' లింక్పై క్లిక్ చేయండి స్టెప్ 16: మరోసారి ఆధార్ లాగిన్ అయి 'సీక్రెట్ కోడ్ ద్వారా చిరునామాను అప్డేట్ చేయండి' ఆప్షన్ ను

ఎంచుకోండి

స్టెప్ 17: మీ 'సీక్రెట్ కోడ్' నమోదు చేయవలసి ఉంటుంది పూర్తయిన తర్వాత క్రొత్త చిరునామాను ప్రివ్యూ చేసి సమర్పించు' బటన్ పై క్లిక్ చేయండి. అంతే... మీకు కావాల్సిన అడ్రస్ అప్ డేట్ అవుతుంది

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.