రైతు బీమా పత్రాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం - Jobnews

Breaking

Monday, 10 August 2020

రైతు బీమా పత్రాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం

రైతు బీమా పత్రాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం

 రెండేళ్ల కిందట తెరాస ప్రభుత్వం రైతు బీమా ప్రవేశ పెట్టడంతో అన్నదాతల కుటుంబాలకు కొంత ఊరట లభించింది. బీమా ప్రారంభించి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో బీమా పత్రాల వివరాల నమోదులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఇచ్చింది. ఈ అంశంపై 'న్యూస్టుడే' కథనం రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో

తెలంగాణ ప్రభుత్వం 2018 ఆగస్టు 15న రైతు బీమా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు 18-59 సంవత్సరాల మధ్య వయసున్న రైతులు అర్హులుగా పేర్కొంది.


మెదక్ జిల్లాలో మొత్తం 2.20 లక్షల మంది రైతులు ఉండగా మొదటి సంవత్సరం 1.04 లక్షల మంది, రెండో సంవత్సరంలో మరో 4 వేల మంది కలిపి 1,08,978 మంది వరకు అయ్యారు. వీరందరికీ బీమా ధ్రువపత్రాలు అందజేయగా వాటిలో ఆధార్ కార్డు, పేర్లు, నామినీ పేరు తప్పుగా నమోదైతే వాటిని సరిచేసుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో సంబంధిత రైతు చనిపోయినా బీమా పరిహారం మంజూరులో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నెల 14 తేదీ నాటికి బీమా ప్రారంభమై రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ధ్రువపత్రాల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు వ్యవసాయ శాఖ అవకాశం ఇచ్చింది.ఇందుకు రైతులు సంబంధిత బీమా పత్రంతో పాటు సరిచేయాల్సిన పత్రాలతో వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో సంప్రదించాల్సి ఉంటుంది.

ఆందోళన కలిగిస్తున్న అన్నదాతల మరణాలు

జిల్లాలో అన్నదాతల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బీమా ప్రారంభమైన మొదటి ఏడాది జిల్లాలో 660 మంది రైతులు చనిపోగా రెండో ఏడాదిలో ఇప్పటి వరకు 701 మంది చనిపోయారు. దీంతో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందింది చనిపోయిన రైతుల కుటుంబాల్లోని వ్యక్తులు భూమి మార్పిడి చేయించుకున్నా వారి పేరిట బీమా పత్రాలు నమోదు కాకపోవడంతో పరిహారం అందే అవకాశం లేకుండా పోయింది. ఈ నెల 13 నుంచి బీమా నమోదు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉండగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే చేపడతామని అధికారులు చెబుతున్నారు. భూమి మార్పిడి తర్వాత రెవెన్యూశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం బీమా నమోదు చేయనున్నారు. ఇందుకు 14.08.1961 నుంచి 14.08.2002 మధ్య పుట్టిన వారి పేరిట కొత్తగా భూమి మార్పు చేయించుకున్న వారికి బీమా పొందే అవకాశం ఉంది. ఈ ఏడాది జిల్లాలో కొత్తగా 6 వేల మంది బీమా పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రైతు బీమా పత్రాలు తప్పులు సరిచేసుకునేందుకు ఈనెల 11 వరకు అవకాశం ఇచ్చారు. నామినీ పేరు, ఆధార్ కార్డుతో పాటు పలు అంశాలు ఏవైనా బీమా పత్రాలు తప్పుగా నమోదై ఉంటే వాటిని సరిచేసుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం కొత్త వారికి బీమా నమోదు ప్రారంభిస్తాం.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.