Telangana government good news for 5,0000 unemployies - Jobnews

Breaking

Tuesday, 14 July 2020

Telangana government good news for 5,0000 unemployies

Telangana government good news for 5,0000 unemployies.



తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. 50,000 మంది నిరుద్యోగులకు పలు అంశాల్లో నైపుణ్యాలు
పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ ఎడ్ టెక్ సంస్థ కోర్స్ ఎరాతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్-TASK, కోర్స్ ఎరా
సంయుక్తంగా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్ చెయిన్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి డిమాండ్ ఉన్న 3,800 కోర్సుల్ని ఉచితంగా నిరుద్యోగ యువతకు అందించనుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జాబ్ మార్కెట్లో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో కోర్స్ ఎలా ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫోర్స్ రికవరీ ఇనీషియేటీవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వ, సంస్థలతో కలిసి 3800 కోర్సుల్ని ఉచితంగా అందిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కోర్స్
ఎరాతో ఒప్పందం చేసుకుంది.



తెలంగాణలోని 50,000 మంది నిరుద్యోగులు కోర్స్ ఎలా అందించే 3,800 కోర్సు నేర్చుకోవచ్చు. కోర్సులు నేర్చుకోవడం మాత్రమే కాదు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి సర్టిఫికెట్లు పొందొచ్చు. నైపుణ్యాలు సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఆసక్తిగల యువతీ యువకులు నిరుద్యోగులు 2020 సెప్టెంబర్ 30 లోగా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరిలోగా కోర్సులు పూరి చేయాలి. మరిన్ని వివరాలకు.

Website
https://www.task.telangana.gov.in/

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.