Rythu bandhu latest news July 18/07/2020
పేద, ధనిక రైతు తో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాల
భూమి ఉన్నా.. ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేసింది. రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ఈ సాయాన్ని వెనక్కి ఇచ్చేందుకు వీలుగా 'గివ్ ఇట్ అప్'ను అమలు చేస్తోంది. పెట్టుబడి సాయం కింద మంజూరు అయ్యే మొత్తాన్ని వద్దనుకున్న పెద్ద రైతులు, నేతలు, ధనవంతులు దరఖాస్తు ద్వారా వెనక్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఈ రోజుల్లో డబ్బులు వద్దనుకునే వారేవరు ఉన్నారు. జిల్లా మొత్తంలో 1.38 లక్షల మంది పెట్టుబడి సాయాన్ని పొందుతుంటే కేవలం 8 మంది మాత్రమే గివ్ ఇట్ అప్ కింద రైతుబంధు సొమ్మును ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి తమ గొప్పతనాన్ని చాటుకుంటారు
వద్దనుకుంటే ఇలా చేయాలి
పెట్టుబడి సాయం పొందే రైతులు తమకు వచ్చిన సాయాన్ని వెక్కి ఇచ్చేందుకు 'గివ్ ఇట్ అప్' అనే ఫారాన్ని నింపి అధికారులకు ఇస్తే వారి ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ కాదు. సాయాన్ని వెనక్కి ఇచ్చే ధనవంతులు ఆ ఫారాన్ని నింపి సంబంధిత మండల వ్యవసాయాధికారి, లేదా తహసీల్దార్లకు అందించాలి. జిల్లా మొత్తంలో 1.38 లక్షల మంది రైతుల ఖాతాల్లో 262.14 కోట్లు జమ కాగా వీరిలో కేవలం ఎనిమిది మంది మాత్రమే అధికారికంగా తమకు వచ్చిన సాయాన్ని
వెనక్కి ఇచ్చారు. అధికారుల లెక్కల ప్రకారం రూ.50 వేలకు
మించి సాయాన్ని పొందే రైతులు 1975 మంది ఉన్నారు. వీళ్లు కాకుండా పెట్టుబడి సాయాన్ని పొందే వారిలో ఉన్నత ఉద్యోగులకు, రూ.కోట్ల ఆదాయం ఉన్నా ప్రజాప్రతినిధులు వ్యాపారులు ఉన్నారు. వారిలో చాలామంది స్వచ్ఛందంగా తమకు మంజూరైనా సాయాన్ని వెనక్కి ఇచ్చే అవకాశమున్నా ఇవ్వలేదు ల
జైనథ్ లో అయిదుగురు.
జైనథ్ మండలానికి చెందిన వారు ఐదుగురు ఉండగా, వారిలో జైనథ్ మండల కేంద్రానికి చెందినవారు ముగ్గురు, పిప్పర్వాడ సాంగ్వి గ్రామాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. బోథ్ ఇచ్చోడ, తలమడుగు మండలాల నుంచి ఒక్కొక్కరు తమకు మంజూరైన మొత్తాన్ని వద్దని ప్రభుత్వానికి ఇచ్చారు
* ఖాతాల్లో డబ్బులు జమ అయిన రైతులు: 1.88 లక్షలు
వివరాలు లభించని రైతులు: 5,431
మంజూరైనా పెట్టుబడి సాయం: రూ. 262.14 కోట్లు పెట్టుబడి సాయాన్ని వెనక్కి ఇచ్చిన వారు 8 మంది
ప్రభుత్వానికి ఇచ్చేసిన మొత్తం: రూ. 1.50 లక్షలు
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.