Open 10th , inter students passed in telangana - Jobnews

Breaking

Saturday, 25 July 2020

Open 10th , inter students passed in telangana

Open 10th , inter students passed in telangana
ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు అంతా పాస్

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కోర్సులకు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులందరినీ పాస్ చేస్తూ జీవో నెంబర్ 12 జారీ చేసింది. అర్హత కలిగిన విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో 35 శాతం మినిమమ్ పాస్ మార్కులు వేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శు క్రవారం విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రా రాంచంద్రన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన ఓపెన్ పరీక్షలు కరోనా కారణంగా వాయి దా పడ్డాయి. పలుమార్లు పరీక్షలు పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఇదే సమయంలో జాతీయస్థాయిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఓపెన్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వరశర్మ నేతత్వంలో సీనియర్ అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఇంటర్మీడియేట్లో మాదిరిగా అందరికీ మినిమమ్ మార్కులు వేసి పాస్ చేయాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా పరీక్షా ఫీజు కట్టిన ఓపెన్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సర్కారు నిర్ణయంతో ఓపెన్ టెన్త్ లో 43 వేల మంది, ఇంటర్మీడియట్లో 32వేల మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు. తక్కువగా మార్కులు వచ్చాయని భావించే వారికి ఇంప్రూవ్ మెంట్ రాసుకోవడానికి అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.