సచివాలయ ఉద్యోగుల రాత పరీక్ష కేంద్రం మార్పునకు అవకాశం
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు తమ పరీక్ష కేంద్రాన్ని మార్చుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పరీక్ష కేంద్రం మార్పు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు రావడంతో ఈ అవకాశం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న రకాల పోస్టులకు సంబంధించి మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది జనవరిలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.