ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు - Jobnews

Breaking

Friday, 10 July 2020

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు


కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం

కంపార్ట్మెంట్ ఉత్తీర్ణులు పరిగణన లక్షల మందికి ప్రయోజనం

విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి ఫస్టియర్ విద్యార్థులకు నిరాశ

ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలతో రాసే అవకాశం

ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తామని తెలిపారు. దీంతో ఆ విద్యార్థులను కంపార్ట్ మెంటల్ ఉత్తీర్ణులుగా మార్కుల జాబితా కాలమ్ లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది మార్కుల మెమోలను ఈ నెల తర్వాత సంబంధిత కళాశాలల్లో పొందే అవకాశం కల్పించారు మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలు పది రోజుల తర్వాత అందజేయనున్నారు.

ఈమేరకు గురువారం విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాయాల్సిందే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం మొదటి సంవత్సరం విద్యార్థుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు పాస్ చేయాలని నిర్ణయించించడం గమనార్హం. దీంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిరాశ తప్పలేదు అయితే ఇంటర్ బోర్డు అధికారులను వివరణ కోరగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థు లు పరీక్షలు రాయాలి. అయితే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దయ్యా యి. అందుకే వారు 2021, మార్చిలో జరిగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్ష లతోపాటు ఫెయిలైన ఫస్టియర్ సబ్జెక్టుల నూ రాయాల్సి ఉంటుంది' ఓ అధికారి వివరించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మందికి 4,85 555 మందికి గాను 288383 మంది మాత్రమే ఉత్తీర్ణులు కాగా 1,92,172 మంది ఫెయిలైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో ఫెయిలైన ఫస్టియర్ విద్యార్థులంతా నిరాశకు గురవుతున్నారు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.