తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా - Jobnews

Breaking

Wednesday, 1 July 2020

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూన్నట్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు వెల్లడించారు. డిగ్రీ, పీజీ కోర్సుల తుది సెమిస్టర్ నిర్వహణపై ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి నుంచి వివరాలు తెలుగు కొన్న తర్వాత కోర్టుకు తెలియజేస్తామని పేర్కొన్నారు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంసెట్, ఎంసెట్, పీజీసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని గత సెమిస్టర్లలో మార్కుల ఆధారంగా డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ ఫలితాలు విడుదలచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై చీప్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ విజ సేన రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది సీ దామోదర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్థులు వైరస్
బారిన పడే ప్రమాదం ఉన్నదని తెలిపారు. హర్యానా మహారాష్ట్ర, ఏపీలోని పలు యూనివర్సిటీలు ప్రవేశపరీక్ష లను వాయిదావేశాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు

భౌతికంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని యూజీసీ సైతం తెలిపిందని పేర్కొన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం అన్ని పరీక్షలకు హాజరయ్యే వీడియో గార్డులను ప్రమోట్ చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. షార్ట్ హ్యాండ్ వంటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ప్రమోట్ చేయాలని కోరలేమని తెలిపింది.

మంత్రిమండలిలో చర్చించి రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని ఏజీ పేర్కొన్నారు. లాక్ డౌన్ విధిస్తే ప్రవేశ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ధర్మా సనం మరోసారి ప్రశ్నించడంతో.. దీనిపై చీఫ్ సెక్రటరీతో చర్చించి వివరాలు వెల్లడిస్తానని, విచారణను మధ్యాహ్న భోజన విరామ సమయానికి వాయిదావేయాలని ఏజీ కోరారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి వాదనలు వినిపిస్తూ అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని హైకోర్టుకు వెల్లడిం చారు. డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ ఉన్నత విద్యామండలి, ఆయావర్సిటీల రిజిస్టార్లతో చర్చిం చాక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు

ఈ మేరకు వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం

పరీక్షల అంశంపై రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీ, ఉన్నత విద్యా మండలి నోటీసులు జారీచేసింది. ఈ మేరకు విచారణను జూలై 9వ తేదీకి వాయిదావేసింది.

రాష్ట్రంలో వాయిదాపడిన అన్ని ప్రవేశపరీక్షలను ఆగస్టు మొదటివారంలో నిర్వహించాలని యోచిస్తు న్నామని, ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుం టామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలి పారు. దేశంలో అన్ని ఐఐటీ, ఎస్టీలలో 2020 - విద్యాసంవత్సరంలో సీట్ల భర్తీకోసం జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ-మెయిన్, 26న నీట్ ప్రవే శపరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్ జరుగనున్నది. ఈ పరీక్షలను ఆయా తేదీ ల్లోనే నిర్వహిస్తే.. తెలంగాణలో పరీక్షలు నిర్వహిం చాల్సి ఉంటుంది. అదే జరిగితే జాతీయ ఎంట్రన్స్ తోపాటు రాష్ట్రంలో ప్రవేశపరీక్షలనూ నిర్వహించే అవ కాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షలు వాయిదా పడితే..
విద్యాసంవత్సరం మొదలు కూడా ఆలస్యం కావడం..
లేదా జీరోఇయర్ చేయక తప్పదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రవేశపరీక్షలు వాయిదాపడిన నేపథ్యంలో జూలైలో డిగ్రీ, పీజీ బీటెక్, ఎంటెక్ తదితర పరీక్షల నిర్వహణ కష్టమేనని చెప్తున్నారు. ఇప్పటికే ఫైనల్ ఇయర్ మినహా అన్ని సంవత్సరాల విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. కాగా ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దయ్యే అవకాశాలే అధికంగా ఉన్నట్టు సమాచారం


No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.