తెలంగాణ డిగ్రీ, పీజీ, బీటెక్ పరీక్షలు రద్దు చేయాలి
పదవ తరగతి ఇ పరీక్షల మాదిరిగా డిగ్రీ ,PG, బీటెక్ పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అంతర్గత మార్పుల ఆధారంగా ఫలితాలను ప్రకటించాలని కోరింది.ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అధ్యక్షులు నాగటి నారాయణ,కార్యదర్శి పగడాల లక్ష్మయ్య బుధవారం లేఖ రాశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం HCU పరీక్షలు లేకుండానే డిగ్రీ పీజీ విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చిందని గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్లోనూ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పరీక్షలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసిందని వివరించారు. కరోన కేసులు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో తెలంగాణ విద్యార్థులకు పరీక్షల నుంచి వెసులుబాటు కల్పించాలని కోరారు.రాష్ట్రంలో డిగ్రీ పీజీ కోర్సులతోపాటు ఫలితాలు ప్రకటించాలని ఆయన కోరారు. కొంత మంది విద్యార్థులకు పెండింగ్లో ఉన్న సబ్జెక్టులను పాస్ అయ్యే విధంగా ఫలితాలు ప్రకటించాలని సూచించారు. దీంతో చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ పీజీ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు ఉద్యోగాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.