ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ - Jobnews

Breaking

Monday, 2 December 2019

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్

ఆర్టీసీ ఉద్యోగులకు
సీఎం కేసీఆర్ వరాలు 


* కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే
పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే
పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు
వేర్వేరు కారు. అందరూ ఒకటే. ఒకే
కుటుంబంలా వ్యవహరించాలి.
యథావిధిగా ఇంక్రిమెంట్ చెల్లింపు.
సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల
కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో
ఉద్యోగం. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం
తరఫున రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా
ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ
ఉద్యోగ భద్రత.
సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణికుడు పైనే
ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లు
వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫారం
వేసుకునే అవకాశం కల్పిస్తాం.
మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్క
రించడానికి, తగు సూచనలు చేయడానికి
ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.
రెండేళ్లపాటు ఆర్టీసీలో గుర్తింపు
యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు.
 ప్రతి డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు
సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును
ఏర్పాటు చేస్తాం.
ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తిం
చేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించా
లి. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా
ఇతర ప్రాంతాల్లో.. అవసరమైతే
ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు
అందుకునేలా చర్యలు తీసుకోవాల
కలర్ బ్లైండ్నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో
చేర్చుకోవాలి తప్ప ఉద్యోగం నుంచి తొల
గించవద్దు.
మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు
వేయొద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ
దిగేలా ఏర్పాట్లు చేయాలి.
ప్రతి డిపోలో కేవలం 20 రోజుల్లో
మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్
టాయిలెట్లు,
డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్
ఏర్పాటు చేయాలి.
మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు
లతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా
మూడు నెలలపాటు చైల్డ్ కేర్ లీవ్స్స్ మంజూరు చేస్తాం.
 మహిళా ఉద్యోగులకు ఖాకీ డ్రెస్ తొల
గిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యోని
ఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం.
పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రెస్

 ప్రతి డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా
మందులు పంపిణీ చేయాలి. మందుల
కోసం బయటకు తిప్పొద్దు.
ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత
బస్సు పాసులు అందించాలి.
-ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్
మెంట్ సౌకర్యం వర్తించేలా ప్రభుత్వ ఉత్త
ర్వులు జారీ చేస్తాం.
ఆ ఉద్యోగుల పీఎఫ్ బకాయిలను, సీపీఎస్కు
చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.
డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్ ను
సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం.
 తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాం
కార్మికుల గృహ నిర్మాణ పథకానికి
రూపకల్పన చేస్తాం.
- ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను
ప్రారంభించాలి.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.