AP TET NOTIFICATIONS 2020 - Jobnews

Breaking

Tuesday, 24 December 2019

AP TET NOTIFICATIONS 2020

           AP TET NOTIFICATIONS 2020


      AP TET NOTIFICATIONS 2020: ఆన్లైన్ పరీక్షపై సమాలోచనలు,టీఆర్టీ 20 శాతం వెయిటేజీ.

AP TET 2020:ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)
షెడ్యూల్ వచ్చే నెల నాలుగు లేదా ఐదో తేదీన విడుదల
కానుంది. షెడ్యూల్ ఇచ్చిన వారం తర్వాత దరఖాస్తుల
స్వీకరణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల
విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. ప్రతి ఏడాది టెట్ ను రెండు
పర్యాయాలు నిర్వహించాల్సి ఉండగా గతేడాది ఫిబ్రవరిలో
ఒక్కసారే నిర్వహించారు. ఈ ఏడాది ఉపాధ్యాయ నియామక
పరీక్ష (టీఆర్టీ) నిర్వహించనున్నందున ముందుగానే టెట్
నిర్వహణ కు షెడ్యూల్ ను రూపొందించారు. వ్యాయామ
ఉపాధ్యాయుల టెట్ నిర్వహించాలా? వద్దా? అనే దానిపై
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతేడాది నిర్వహించిన టెట్ పై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈసారి దీనిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. SGT, అసిస్టెంట్ లకు రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నదున ఆంగ్లం పేపర్ వేరుగా ఉండనుంది.

ఆన్ లైన్ ఉంటుందా?

గతేడాది టెట్ను మొదటిసారిగా ఆన్లైన్లో నిర్వహిం
చారు. రాష్ట్రంలో కంప్యూటర్ సదుపాయం లేకపోవడంతో
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో పరీక్ష కేంద్రాలను
కేటాయించారు. దీనిపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తి
మైంది. దీంతో కొంత సర్దుబాటు చేశారు. ఈ ఏడాది టెట్.
. ఆన్లైన్ నిర్వహించాలా? పేపరు, పెన్ను విధానంలో
నిర్వహించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
గతేడాది టెట్ కు 4,46,833 మంది దరఖాస్తు చేయగా
2 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,94,093
మంది (46, 86 శాతం) మాత్రమే అర్హత సాధించారు. జనరల్
వారు 60, బీసీ-50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం అర్హత
మార్కులు సాధించాల్సి ఉంటుంది.
టెట్ లో వచ్చే మార్కులకు టీఆర్టీలో 20% వెయిటేజీ
ఉండడంతో ఈసారి టెట్ రాసేవారి సంఖ్య పెరుగుతుందని
అధికారులు భావిస్తున్నారు. మార్కుల మెరుగు కోసం ఒకటి,
రెండు పర్యాయాలు రాసినవారు దరఖాస్తు చేసే అవకాశం
ఉంది. ఒకసారి టెట్ రాస్తే ఏడేళ్ల వరకు అర్హతగా ఉంటుంది.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.