Telangana inter exams 2020 Latest update - Jobnews

Breaking

Monday, 25 November 2019

Telangana inter exams 2020 Latest update

మార్చి తొలి వారంలో లో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు 


👉నామినల్ రోల్స్ లో సవరణలకు 30 వరకు అవకాశం

👉పరీక్షల నిర్వహణకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి

👉డిఐఈవొ, ప్రిన్సిపాల్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు


రాష్ట్రంలో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్ పరీక్షలు, march మొదటి వారంలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో పక్కా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులకు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం తో కలిసి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన సూచించారు విద్యార్థులు చెల్లించిన ఫీజులను వెంటనే బోర్డుకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో స్టూడెంట్ కౌన్సిలర్లను నియమించి శిక్షణ కూడా ఇచ్చినందున పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కూడా యాజమాన్యాలు కౌన్సిలర్లను నియమించుకోవాలని ఆదేశించారు.




నామినల్ రోల్స్ లో సవరణకు అవకాశం

ఇంటర్ పరీక్షల నామినల్ రోల్స్ లో తప్పులు పొరపాట్లను సరిచేసుకోవడానికి కాలేజీలకు ఈనెల 30 వరకు గడువు విధించినట్లు కార్యదర్శి ఆదేశాలలో పేర్కొన్నారు. మాతృభాష,మతo, సబ్ కాస్ట్, జెండర్, కమ్యూనిటీ, ఫోటో /విద్యార్థి సంతకం వంటి వాటి సవరణల కోసం tsbie.cgg.gov.in లేదా admi.tsbie.gov.in వెబ్ సైట్లు సంప్రదించాలని ఆయన సూచించారు.


ప్రైవేట్ ఫీజు చెల్లింపునకు 30 వరకు గడువు

రాష్ట్రంలో కాలేజికి వెళ్ళకుండా ప్రైవేటుగా మార్చిలో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారి తెలిపారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.