ఖరీఫ్ సీజన్ రైతుబంధు డబ్బులు విడుదల - Jobnews

Breaking

Wednesday, 19 June 2019

ఖరీఫ్ సీజన్ రైతుబంధు డబ్బులు విడుదల


రైతుబంధు పథకం కింద రూ. 33.70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 3 వేల 430 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. జూన్ 18వ తేదీ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి వెల్లడించారు. మిగిన రైతులకు విడతల వారీగా సొమ్ము జమ చేస్తామన్నారు. వానాకాలం పంటల పెట్టుబడి కోసం ఎకరానికి రూ. 5 వేల చొప్పున 54.50 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

రైతు బంధు పథకాన్ని ఎంతో మంది ప్రశంసించారు. ఏకంగా ఐక్యరాజ్యసమితి కూడా దీనిని ప్రశంసించింది. పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం - కిసాన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది.

ఇంత సొమ్మును ఏ ప్రభుత్వం ఇవ్వడంలేదు. ప్రతీ రైతుకు ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు రైతుబంధు కింద ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ రైతుకు పెట్టుబడి సాయం చేయాలని భావించి బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం 54.50 లక్షల మందికి ఈ ఖరీఫ్‌లో ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసింది.No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.